ఏపీకి కుంకీ ఏనుగులను పంపండి.. కర్ణాటక మంత్రికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

by srinivas |
ఏపీకి కుంకీ ఏనుగులను పంపండి.. కర్ణాటక మంత్రికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. రైతుల పంట పొలాలను తరచూ ధ్వంసం చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. మళ్లీ కొన్ని రోజులకు ఏనుగులు పొలాలపైపడుతున్నాయి. ఇలా చాలా సార్లు నష్టపోయిన రైతులు.. ఈ సమస్యను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యకు పరిష్కారం చూపుతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

వెంటనే అటవీశాఖ అధికారులతో పవన్ కల్యాణ్ నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఏనుగులను తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని పవన్ కల్యాణ్ కు అటవీ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 2 కుంకీ ఏనుగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీంతో ఏనుగుల మందలను తరమలేకపోతున్నామని చెప్పారు. కుంకీ ఏనుగులు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, వీటిని రాష్ట్రానికి తీసుకొస్తే సమస్యలు తీరే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ దృష్టికి అటవీ అధికారులు తీసుకెళ్లారు.

ఈ మేరకు కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడేందుకు పవన్ కల్యాణ్ తాజాగా బెంగళూరు వెళ్లారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ బి.ఖంద్రేతో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని, ప్రాణ హాని కలిగిస్తున్నాయని, ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని బి. ఖంద్రేకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక అటవీ శాఖ పరిధిలో ఉన్న కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి పంపాలని పవన్ కల్యాణ్ కోరారు. దీనిపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed