Pawan Kalyan: గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం.. అతిసార బాధితులకు పరామర్శ

by srinivas |   ( Updated:2024-10-21 07:22:36.0  )
Pawan Kalyan: గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం.. అతిసార బాధితులకు పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) విజయవనగరం జిల్లా గుర్ల(Vijayanagaram District Gurla) గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ గ్రామంలో అతిసార(Diarrhea) బారిన పడిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా SSR పేట పంపు హౌస్ వద్దకు వెళ్లిన ఆయన నీటి నాణ్యత(Water quality) పరిశీలించారు. ప్రస్తుతం ఆయన పర్యటన కొనసాగుతోంది.


కాగా గుర్ల గ్రామంలో నీటి కాలుష్యం కారణంగా అతిసార ప్రబలి పలువులు గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారని, పలువురికి చికిత్స అందుతోందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో గ్రామంలోని బాధితులను పరామర్శించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరి నుంచి గుర్ల గ్రామాలకు వెళ్లారు.

మరోవైపు గుర్ల ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే గుర్లలో అతిసారం ప్రబలిందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు 11 మంది చనిపోయారని ఆరోపణలు చేస్తున్నారు. అటు ఒకరే చనిపోయారని వైద్య శాఖ వెల్లడించిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీటన్నింటిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్ల గ్రామంలో పర్యటిస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed