- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను తిడితే జగన్‌కు నచ్చుతుందా?
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ.. ఎలాగైనా జగన్‌ను గద్దె దించాలని జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు దూకుడు పెంచాయి. అభ్యర్థులను ప్రకటిస్తూ జగన్ వేగం పెంచగా.. పొత్తు ఖరారు చేసుకునే ప్లాన్‌లో విపక్షాలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు. సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినీతి, లంచగొండి ప్రభుత్వమంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల కామెంట్లకు వైసీపీ నేతలు కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్లు ఇస్తున్నారు. షర్మిలను, తల్లి విజయమ్మను వ్యక్తిగతంగానూ దూషిస్తున్నారు.
దీంతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై మేధావులు, రాజకీయ విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఈ పరిస్థితిపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. వైసీపీ ఓ ఉన్మాద పార్టీ అని సీరియస్ కామెంట్స్ చేశారు. సొంత అన్న అయ్యి ఉండి చెల్లి షర్మిలపై వ్యక్తిగత దూషణలు చేయించడం దారుణమని అన్నారు. మౌనంగా ఉన్న విజయమ్మను తిడుతున్నా.. జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రశ్నించారు. సొంత ఫ్యామిలీని ఎవరైనా తిడితే జగన్‌కు నచ్చుతుందా? అని అడిగారు. షర్మిలపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.