- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐదేళ్లు ఏం చేశారు?.. మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్
దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో ఏపీకి పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా కేటాయింపులు ఉంటాయా.. ఉండవా అని ఆమె ప్రశ్నించారు. ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఢిల్లీలో ధర్నా చేస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపైనా ఆమె స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. జగన్ ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమస్యలపై ఐదేళ్ల పాటు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు. ఇప్పుడు పార్టీ ఉనికి కోసమే జగన్ ఢిల్లీ డ్రామాలు మొదలు పెట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘‘గత ఐదేళ్లలో హత్యా రాజకీయాలు చేశారు. బాబాయ్‌ను చంపిన వాళ్లతోనే తిరిగారు. సొంత చెల్లినే వెన్నుపోటు పొడిచారు. ఐదు కోట్ల ప్రజల హక్కు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదు.’’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
Read More..