YCP శాశ్వత అధ్యక్షుడిగా జగన్.. భారీ షాకిచ్చిన ఎలక్షన్ కమిషన్

by GSrikanth |
YCP శాశ్వత అధ్యక్షుడిగా జగన్.. భారీ షాకిచ్చిన ఎలక్షన్ కమిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది. ఒక రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు ఉండకూడదని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఎన్నికలు జరగాలని వెల్లడించింది. ఏ పార్టీ ఎన్నికలైనా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే జరగాలని తెలిపింది. ఈ వ్యవహారంలో పార్టీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని.. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి ఉత్తర్వులు పంపారు. అంతేగాక, దీనిపై బహిరంగ ప్రకటన చేయాలని వైసీపీ పార్టీని ఈసీ ఆదేశించింది. కాగా, ఇటీవల గుంటూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో వైఎస్ జగన్‌ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed