AP: జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన రాయపాటి అరుణ

by Shiva |
AP: జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన రాయపాటి అరుణ
X

దిశ, వెబ్‌డెస్క్: భీమవరంలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు కౌంటర్‌గా నేడు వైసీపీ నాయకులకు, జనసేన నాయకురాలు రాయపాటి ఓ రేంజ్ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారంటూ ఫైర్ అయ్యారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జనసేన సునామీ ఖాయమని, ఆ సునామీలో వైసీపీ కుట్టుపోవడం పక్కా అని అన్నారు. పవన్ కల్యాణ్2ను రాజకీయంగా ఎదుర్కొనలేకే వైసీపీ చిల్లర వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన ఎన్నికల్లో సీఎం జగన్‌పై కోడికత్తి దాడి జరిగిందని, మళ్లీ ఇప్పుడు రాయితో దాడి చేయించుకుని ఆ అపవాదు ప్రతిపక్షలపై రుద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ చిల్లర ఎత్తుగడలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎవరైనా దాడి చేస్తే గులకరాళ్లతో దాడి చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story