- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవి విప్లవాత్మకమా.. కావా..: పాయకరావులో సీఎం జగన్ సంచలన ప్రశ్నలు
దిశ, వెబ్ డెస్క్: 13 రోజుల్లో రాష్ట్రంలో మహాసంగ్రామం జరగబోతోందని, అది పేదలకు, మోసాలకు మధ్య జరిగే యుద్ధమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయని.. లేదంటే మొత్తం రద్దు అవుతాయన్నారు. వచ్చేవి ఎంపీనో, ఎమ్మెల్యేనో ఎన్నుకునే ఎన్నికలు కావని, ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు. తమ 59 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మమైన మార్పులు తీసుకొచ్చామని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన ఘనత తమదేనన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దనే పింఛన్ అందిస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయం, వార్డు వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు పాలనను చేరువ చేశామని జగన్ పేర్కొన్నారు. అమ్మఒడి లాంటి పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించామని గుర్తు చేశారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, లంచాలకు తావులేకుండా పథకాలు అందజేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read More...