- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Jagan: రెండు నెలల్లోనే ఆ స్కామ్.. అదీ చంద్రబాబు స్కిల్
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడారు. స్కిల్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసిందన్నారు. చంద్రబాబు చూపించిన అతి గొప్ప స్కిల్ అది అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం అతి పెద్దదని సీఎం తెలిపారు. చంద్రబాబు టెండర్లు కూడా చేపట్టకుండా లోపాయికారి ఒప్పందం చేసుకుని దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే స్కామ్ జరిగిందని చెప్పారు. వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ.371 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీలోని వ్యక్తితో లాలూచి పడి చంద్రబాబు అన్ని నిబంధనలను గాలికొదిలేశారని సీఎం జగన్ ఆరోపించారు.
విదేశీ లాటరీ తరహాలో స్కాం
విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారని సీఎం జగన్ తెలిపారు. 90 శాతం సీమెన్స్, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారని సీఎం వ్యాఖ్యానించారు. సుమారు రూ. 3 వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని ప్రచారం చేశారని తెలిపారు. ఒక ప్రైవేటు కంపెనీ ఎక్కడైనా రూ. 3వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారని, ఒక క్లస్టర్‌కు రూ. 546 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని, కేబినెట్ నిర్ణయం, ఒప్పందానికి సంబంధం లేకుండా జీవో స్వరూపాన్ని మొత్తం మార్చేశారని జగన్ వ్యాఖ్యానించారు. దోచుకో, పంచుకో తినుకో అన్నదే వారి విధానమని సీఎం విమర్శించారు.