నమ్మిన వారి కోసం నిలబడే నాయకుడిగా ముద్ర వేసుకున్న పరిటాల రవికి నివాళులర్పించిన AP సీఎం&నారా లోకేశ్

by Anjali |   ( Updated:2024-08-30 07:21:47.0  )
నమ్మిన వారి కోసం నిలబడే నాయకుడిగా ముద్ర వేసుకున్న పరిటాల రవికి నివాళులర్పించిన AP సీఎం&నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు, టీడీపీ నేత దివంగత పరిటాల రవి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడిగా కొనసాగారు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో ఈయన మృతి చెందారు. అయితే నేడు పరిటాల రవి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికన ఆయనకు నివాళులు అర్పించారు. ‘అన్యాయానికి గురైన సామాన్యులకు అండగా నిలవడం కోసం చివరిక్షణం వరకు పోరాడిన ఒక నిలువెత్తు సిద్ధాంతం పరిటాల రవి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.

నమ్మిన వారి కోసం నిలబడే నాయకుడిగా ప్రజాజీవితంలో తనదైన ముద్రతో అభిమానులను సంపాదించుకున్న తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పరిటాల రవి అంటూ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు రవికి నివాళులు అర్పించారు. ‘పేదల సంక్షేమం కోసం, రాయలసీమ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజా నాయకుడు పరిటాల రవి అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.పేదల సంక్షేమం కోసం, రాయలసీమ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజా నాయకుడు పరిటాల రవి అన్నారు. దివంగత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల రవి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని వెల్లడించారు.

Advertisement

Next Story