Chandrababu Nayudu : ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

by M.Rajitha |
Chandrababu Nayudu : ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Nayudu) కొద్దిసేపటి క్రితం ఢిల్లీ(Delhi) చేరుకున్నారు. శాసనసభ సమావేశాల అనంతరం ఆయన ఢిల్లీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి రావలసిన నిధులపై పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. మరికాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్(NirmalaSitharaman) తో ప్రత్యేక సమావేశం అవనున్నారు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన నిధుల విషయం కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం జైశంకర్ తో భేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha)తో సమావేశం అవుతారని సమాచారం. ఈ సమావేశాలు ముగించుకొని రేపు ఉదయం మహారాష్ట్రకి వెళ్లనున్నారు. ఈనెలలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక(Maharashtra Assembly Elections)ల్లో ఎన్డీఏ(NDA) తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Advertisement

Next Story