AP: పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ.. అలా చేయాలంటూ కీలక విజ్ఞప్తి

by Shiva |   ( Updated:2024-04-24 16:17:38.0  )
AP: పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ.. అలా చేయాలంటూ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్లు పింఛన్ల పంపిణీలో భాగస్వాములు కాకూడదంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వృద్ధులు, వికలాంగులు పింఛన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. మే 1న ఇంటింటికీ పింఛన్లు ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా పింఛన్ల పంపిణీ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు.

Read More...

AP Politics:సైకిల్‌కి ఓటేసి అరాచకాన్ని పారద్రోలండి: టీడీపీ అభ్యర్థి

Advertisement

Next Story