ఏపీ బడ్జెట్.. దేవాదాయశాఖకు భారీగా కేటాయింపులు

by Mahesh |
ఏపీ బడ్జెట్.. దేవాదాయశాఖకు భారీగా కేటాయింపులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) 2024-2025 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో మొత్తం 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం(Revenue Expenditure) అంచనా రూ.2.34లక్షల కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు, ద్రవ్యలోటు రూ.68,743 కోట్లుగా ప్రతిపాదించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలోనే రూ. 43,402 కోట్ల వ్యవసాయ శాఖ(Department of Agriculture) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే ముందుగా చెప్పినట్టుగానే దేవదాయ శాఖ(Devadayashakha)కు ఈ బడ్జెట్ లో ఎన్నడూ లేనివిధంగా నిధులు కేటాయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎండోమెంట్(Endowment) కింద ఉన్న 6 వేల దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు గతంలో ఇస్తున్న 5 వేల రూపాయలను 10 వేలకు పెంచారు. అలాగే అర్చకుల వేతనం రూ.10 నుంచి రూ.15 వేలకు పెంచారు. వేద విద్య చదువుకున్న నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతుల పునరుద్ధరణ, 160 దేవాలయాల ఆధునీకరణ పనులకు రూ.113 కోట్లు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలోని దేవాలయాలు రానున్న కాలంలో సమస్యలకు దూరంగా ఉండి.. పర్యాటకులతో సందడిగా మారుతాయని ప్రజలు, విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed