AP Budget : బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బుగ్గన

by Sathputhe Rajesh |
AP Budget : బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బుగ్గన
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే 2023-24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బుగ్గన బయల్దేరారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు అధికారులతో కలిసి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయల్దేరారు.

సెక్రటేరియట్‌లో బడ్జెట్ ప్రతులకు బుగ్గన, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు బడ్జెట్ ను బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. పేదలు, బలహీన వర్గాలకు బడ్డెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. ఈ సారి బడ్జెట్ సుమారు 2.56 లక్షల కోట్ల అంచనాలతో రూపొందినట్లు తెలిసింది.

Advertisement

Next Story