AP Breaking: పోలవరం ప్రాజెక్ట్ పై.. విదేశీ నిపుణుల కీలక సూచనలు!

by Geesa Chandu |   ( Updated:2024-08-16 14:38:55.0  )
AP Breaking: పోలవరం ప్రాజెక్ట్ పై.. విదేశీ నిపుణుల కీలక సూచనలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో కీలకమైనది పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కొన్ని ముఖ్యమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాలం ముగియగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా.. ప్రాజెక్టు డిజైన్, దాని నిర్మాణ అంశాల గురించి చర్చించేందుకు వీలుగా వర్కుషాప్ ను ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. దీనిలో ప్రాజెక్టు డిజైన్, ప్రాజెక్టును పర్యవేక్షించే నిపుణుల బృందంతో పాటుగా విదేశీ నిపుణుల బృందం కూడా ఉండాలని సూచించింది. అయితే ప్రధాన డ్యాం పొడవునా సీపేజీ నీటిమట్టానికి 8 మీటర్ల ఎత్తులో.. ఒక ప్లాట్ ఫాం నిర్మించాలని, దాని నుంచి ఎప్పుడూ నీటిమట్టం 8 మీటర్ల కన్నా కిందికి ఉండేలా పంపింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బృందం స్పష్టం చేసింది. అయితే దీనికి సంబధించిన ఏర్పాట్లు వచ్చే వానాకాలం నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలని బృందం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, అంతకుముందు వరకు జరిగిన పనుల గురించి ఆరా తీశారు. ఇక విదేశీ నిపుణుల బృందం క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించి, కొన్ని సూచనలు చేసింది. అదేంటంటే.. డిజైన్ మార్పులకు అనుగుణంగా కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం లను నిర్మించాలని చెప్పింది. ఎగువ మరియు దిగువ కాఫర్ డ్యామ్ ల సీపేజీని పూర్తిగా నియంత్రించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ఈ సందర్బంగా తెలిపినట్లు సమాచారం.

Advertisement

Next Story