- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Health University: వైసీపీకి బిగ్ షాక్.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెల్త్ యూనివర్సిటీ(Health University)కి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్(NTR) పేరును పునరుద్ధరించింది. అంతేకాదు.. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. వైద్య వృత్తి సవరణ బిల్లు, వ్యవసాయ సహకార సంఘాల సవరణ బిల్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లలకు ఆమోదం అసెంబ్లీలో ఆమోదం లభించింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తూ స్వీకర్ అయ్యన్న ప్రకటన చేశారు.
మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ కారణాలతోనే అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చిందని విమర్శించారు. హెల్త్ వర్సిటీ పేరు మార్పు కారణంగా అనేక వర్సిటీలో అడ్మిషన్లకు ఇబ్బందులు ఎదురయ్యాయని.. విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులు ఇబ్బందిపడ్డారని చెప్పారు.