Ap News: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి నిరవధిక వాయిదా

by srinivas |   ( Updated:2024-11-22 10:27:04.0  )
Ap News: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(Ap Assembly), శాసనమండలి(Legislativ Assembly) నిరవధిక వాయిదా పడ్డాయి. రెండు సభలు కూడా ఈ నెల 11న ప్రారంభమయ్యాయి. మొత్తం పది రోజుల పాటు సమాశాలు వాడీవేడీగా సాగాయి. అసెంబ్లీకి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ycp Chief Jagan Mohan Reddy) హాజరుకాలేదు. అటు వైసీపీ సభ్యులు సైతం గైర్హాజరయ్యారు. శాసనసభ(Assembly)కు సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సహా టీడీపీ(Tdp), బీజేపీ(Bjp), జనసేన(Janasena) ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఇటు శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మె్ల్సీలు హాజరయ్యారు. టీడీపీ, వైసీపీ సభ్యుల ప్రశ్నలు సమాధానాలతో శాసనమండలి 10 రోజుల పాటు దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Mlc Bosta Satyanarayana), టీడీపీ మంత్రుల మధ్యలు మాటలయుద్ధం సాగింది. ఇక ఏపీ అసెంబ్లీ 59 గంటల 57 నిమిషాల పాటు సాగింది. 75 ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు చెప్పారు. 21 ప్రభుత్వ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే వార్షిక బడ్జెట్‌ను సైతం ప్రవేశ పెట్టారు. చర్చించారు. అటు శాసనమండలిలోనూ 8 బిల్లులకు ఆమోదం తెలిపారు. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని మండలి రద్దు చేసింది. అలాగే లోకాయుక్త సవరణ బిల్లు 2024కు ఆమోదం లభించింది.

Advertisement

Next Story