- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీహెచ్‌డీ పూర్తి చేసిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారు. దీంతో ఇప్పటి వరకు కాకాణి గోవర్థన్ రెడ్డిగా పిలబడే మంత్రి ఇకపై డాక్టర్ కాకాణి గోవర్ధన రెడ్డిగా మారబోతున్నారు. పీహెచ్‌డీ వైవా ప్రజంటేషన్‌ను కాకాణి గోవర్థన్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎం సుందరవల్లి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి ధృవీకరణ పత్రం అందజేశారు. ఇకపోతే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని శ్రీ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ రీసెర్చ్ లో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పీహెచ్‌డీ చేస్తున్నారు.
అధ్యయనం అనంతరం పీహెచ్‌డీ నివేదిక (వైవా)ను యూనివర్సిటీ అధ్యాపకులు,విద్యార్థుల సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి సమర్పించారు. మంత్రి ప్రజెంటేషన్‌ను అభినందించి డాక్టరేట్‌కు కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఇదిలా ఉంటే పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు తనకు సహకరించిన యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది అందరికీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.