జగన్ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?: అనిల్ కుమార్ యాదవ్

by Rajesh |
జగన్ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?: అనిల్ కుమార్ యాదవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో 175 స్థానాల్లో 175 మంది అభ్యర్థులను నిలబెట్టే దమ్ము ధైర్యం టీడీపీకి ఉందా అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అటు జనసేన పవన్ కల్యాణ్‌కు సైతం 175కి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఆ దమ్ము ధైర్యం ఉంటే సీఎం వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో గురువారం మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి కలిసి వచ్చేదేమీ లేదని చెప్పుకొచ్చారు.

లోకేశ్ పాదయాత్ర పూర్తయ్యే లోపు టీడీపీ తడిగుడ్డ వేసుకొని ఇంట్లో ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా అంటూ సెటైర్లు వేశారు. సింగిల్‌గా పోటీ చేసే సత్తా లేని వీళ్లు సీఎం జగన్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీకి పొత్తులు అవసరం లేదని.. అప్పుడూ ఇప్పుడూ తాము సింగిల్‌గానే పోటీ చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా టీడీపీ, జనసేనలకు ఉందా అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిలదీశారు.

Next Story