- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. రంగంలోకి దిగిన కూతురు
దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి తనకు టికెట్ లేదని, అతడి తమ్ముడు చిన్నీ (శివనాథ్)కి అదే స్థానంలో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఓకే చెప్పిందని తెలియడంతో ఎంపీ కేశినేని నాని నిన్న ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీలో తనను వద్దనుకున్నప్పుడు.. నేనుందుకు అందులో ఉండటం అంటూనే త్వరలో ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామంతో నిన్న తిరువూరు సభ సక్సెస్ అయిన సంతోషం కూడా టీడీపీకి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కేశినేని నాని ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ఇవాళ నా కూతురు శ్వేత ప్రస్తుతం విజయవాడ నగర కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇవాళ ఆమె ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన పదవికి రాజీనామా చేసి ఆమోదింపజేసుకుని, ఆ మరుక్షణమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నానీ పార్టీ నుంచి వెళ్లిపోతూ.. రాజకీయంగా పెద్ద డ్యామేజ్ చేస్తూ వెళ్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.