- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో సేనను స్థాపించిన హరిరామ జోగయ్య
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాపు నేత హరిరామ జోగయ్య మరో సేనను స్థాపించారు. ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన ఆయన.. తాజాగా కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం చేపట్టే సత్తా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని పోయి రాజ్యాధికారం చేపట్టడమే లక్ష్యంగా కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయం అని హరిరామ జోగయ్య ప్రకటించారు. అయితే, ఇటీవల టీడీపీ-జనసేన-బీజేపీతో పొత్తుపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. 21 సీట్లు జనసేనకు ఇవ్వడమేంటే.. పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా అన్యాయం చేయడమే అని అన్నారు.
Read More..
సీఎం జగన్ సెల్ఫ్ గోల్..! వివేకా హత్య కేసులో చంద్రబాబుపై పరోక్ష ఆరోపణలు