YSRCP: వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై

by Jakkula Mamatha |   ( Updated:2024-11-23 10:38:20.0  )
YSRCP: వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Election) వైసీపీకి కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో పలువురు పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు వైసీపీని(YCP) వీడి అధికార టీడీపీ(TDP)లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) పార్టీకి రాజీనామా చెప్పారు. అసలు విషయంలోకి వెళితే.. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు. కాగా కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీ లో పనిచేశారు. గత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.


Read More..

Nandigama: చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు.. ముగ్గురు అరెస్ట్


Advertisement

Next Story

Most Viewed