తిరుమల కొండపై మరోసారి అపచారం

by Seetharam |   ( Updated:2023-09-07 07:35:44.0  )
తిరుమల కొండపై మరోసారి అపచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై మరోసారి అపచారం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లడం కలకలం రేపింది. ఇటీవల కాలంలో తిరుమల కొండపై నుంచి విమాన సర్వీసులు తిప్పుతున్నారు. తాజాగా ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లడం పట్ల భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని అతిక్రమించడంపై మండిపడుతున్నారు. గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్లడంపట్ల ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ టీటీడీ అభ్యంతరాలను విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Next Story