కనిపించిన మరో చిరుత.. తిరుమల నడకదారిలో మళ్లీ హై టెన్షన్..

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-14 05:32:11.0  )
కనిపించిన మరో చిరుత.. తిరుమల నడకదారిలో మళ్లీ హై టెన్షన్..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో మరో చిరుత కనిపించడంతో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో నామాల గవి ప్రాంతంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించడంతో వారు కేకలు వేసి పరుగులు తీశారు. దీంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఉదయమే ఒక చిరుత బోనుకు చిక్కగా టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరో చిరుత కనిపించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. బోనులో చిక్కిన చిరుత పిల్లలే సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల బాలికను చిరుత ఎత్తుకెళ్లి చంపి తినేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story