AP Govt:రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
AP Govt:రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేడు(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్(State Investment Promotion) కమిటీలో ఇండస్ట్రీస్ కమీషనర్ మెంబర్ కన్వీనర్‌గా, ఫైనాన్స్, రెవెన్యూ, ఇరిగేషన్, ఇండస్ట్రీస్ ఇతర డిపార్ట్మెంట్‌ల స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీ, సెక్రెటరీలను సభ్యులుగా నియమించారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించే నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అమెరికా పర్యటనలో పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఏపీలో ఉన్న మౌలిక సదుపాయాలపై వివరించారు. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై పాలసీల రూపకల్పన పై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story