AP News:రాష్ట్రంలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్

by Jakkula Mamatha |
AP News:రాష్ట్రంలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మందుబాబులకు మరో శుభవార్త. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మద్యం పై కీలక ప్రకటన చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ‘రూ.99 మద్యానికి మంచి ఆదరణ వస్తోంది. ఇప్పటివరకు 5లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయి. పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాయి. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని, ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయి’ అని మంత్రి చెప్పారు.

ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించామని తెలిపారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి(Corruption) జరిగిందని, రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయని విమర్శించారు. నూతన మద్యం విధానాన్ని(New liquor policy) అమలు చేసి మద్యం ధరలు తగ్గించామని తెలిపారు. ఈ క్రమంలో రూ.99కే చీప్ లిక్కర్‌ను అన్ని చోట్లా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పొరుగు రాష్ట్రం కంటే ఏపీలో ధర తక్కువే ఉండేలా.. టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed