AP Cabinet Meeting:కేంద్రం నుంచి.. మరో‘వరం’..నేటి కేంద్ర కేబినెట్ అజెండాలో చేర్పు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-28 15:22:16.0  )
AP Cabinet Meeting:కేంద్రం నుంచి.. మరో‘వరం’..నేటి కేంద్ర కేబినెట్ అజెండాలో చేర్పు
X

దిశ, డైనమిక్​బ్యూరో:కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్​కు మరో తీపి కబురు అందనుంది. నేడు జరుగుతున్న కేబినెట్​ సమావేశంలో పోలవరానికి సంబంధించిన కీలక ప్రతిపాదన చేసింది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ.12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదే జరిగితే పోలవరం పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరారు. 12,500 కోట్ల ప్రతిపాదనలకు ఇప్పటికే పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. నవంబరు నుంచి కొత్త డయాఫ్రం వాల్​పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనుల్లో వేగం పెంచేందుకు కేంద్రం నుంచి వచ్చే నిధులు వేగవంతం కానున్నాయి.

అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు చెబుతుంటారు. పోలవరం ప్రాజెక్ట్‌ రాష్ర్ట ప్రజల కల కూడా. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతులకు సాగునీటి కష్టాలు తీరతాయి. సముద్రంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేయవచ్చు. ఇవన్నీ తెలిసినా గత ప్రభుత్వం దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోలేదనే అపవాదు మూటగట్టుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. చిన.. అప్పటి వరకు జరిగిన పనుల పై ఆరా తీశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కలిసి విదేశీ నిపుణులు బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ బృందం పోలవరాన్ని పరిశీలించి కీలక సిఫార్సులు చేసింది. డిజైన్‌ మార్పులతో కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని పేర్కొంది. దీంతో వేగంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలని భావించింది. ఇందుకోసం కొత్త ప్రాజెక్ట్‌ డిజైన్‌ను కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్‌కు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహామండలి, రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదముద్ర వేశారు. చివరిగా కేంద్ర కేబినెట్​ఆమోదం పొందాల్సి ఉండగా నేడు ఆ అంశాన్ని సమావేశపు అజెండాలో చేర్చారు.

ఢిల్లీ పర్యటనలో ఇదే అంశం..

పోలవరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త డీపీఆర్​ రూపొందించింది. ఇది ముందుకు సాగాలొంటే కేంద్ర నుంచి తప్పనిసరిగా నిధులు విడుదల కావాలి. వారం కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఎన్​డీఏ పెద్దలతో కలిశారు. ముఖ్యంగా పోలవరానికి నిధుల గురించే ఆయన ప్రధాని మోడీ, మంత్రులతో నిర్మలా సీతారామన్​, పాటిల్​తో చర్చించినట్లు సమాచారం. పోలవరంలో 45.72 మీటర్ల మేర నీళ్లు నిలబెట్టేలా చేపట్టబోయే అన్ని పనులకు నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ఈ మేరకు నాలుగు రోజుల కిందటే కేంద్రం క్యాబినెట్​ అజెండాను సిద్ధం చేయగా..నేడు దానిని ఆమోదించనుంది.

Advertisement

Next Story