- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS జగన్‌కు బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ హై కోర్టు.. సీబీఐ న్యాయస్థానానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా హై కోర్టు ఆదేశించింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరుఫు లాయర్లకు సూచించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను జూలై 23కి వాయిదా వేసిన ధర్మాసనం.. జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.
కాగా, సీబీఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హై కోర్టు.. పై ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాపును స్పీడప్ చేయాలని హై కోర్టు ఆదేశించడంతో.. ఈ కేసుల్లో ఎలాంటి తీర్పు వస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read more...
Breaking:వైసీపీకి బిగ్ షాక్..ఐదుగురు పార్టీ కీలక నేతలు అరెస్ట్