జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ పార్టీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా

by Mahesh |   ( Updated:2024-09-18 11:46:04.0  )
జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ పార్టీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ పార్టీ(YCP party)కి భారీ షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేయగా.. ఈ రోజు వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy)రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పలు కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు, బంధుత్వాలు వేరు వేరు అని, జగన్(Jagan) నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను వ్యతిరేకించానని, రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలని, విలువలను కాపాడాల్సిన బాధ్యత మన పైనే ఉందని, ఆ విలువలను నమ్ముకుని.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశానని ఇప్పుడు కొన్ని కారణాలతో పార్టీ వీడుతున్నానన్నారు. అలాగే తన రాజీనామా లేఖను మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే రేపు(గురువారం) బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన ధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan)తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story