Breaking:అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం..టిఫిన్, భోజనాల టైమింగ్స్ ఇవే!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-15 15:56:20.0  )
Breaking:అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం..టిఫిన్, భోజనాల టైమింగ్స్ ఇవే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో నేడు (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పునః ప్రారంభించారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాయి. సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి టోకెన్లు కొనుగోలు చేసి క్యాంటీన్‌లో భోజనం చేశారు.

భోజనాల టైమింగ్స్ ఇవే..

అన్న క్యాంటీన్లలో రూ. 5కే టిఫిన్, భోజనాన్ని అందిస్తారు. నామమాత్రపు ధరతో పేదలు కడుపు నింపుకోవాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి ప్రతి రోజు 1.05 లక్షల మందికి ఆహారాన్ని సరఫరా చేయనున్నారు. మార్నింగ్ 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేల మందికి భోజనం, రాత్రి మరో 35 వేల మందికి భోజనం అందించనున్నట్లు తెలిపారు.

*ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ అందుబాటులో ఉంటుంది.

*మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు భోజనాన్ని అందిస్తారు.

*రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు డిన్నర్ ఉంటుంది.

*ఆదివారం అన్న క్యాంటీన్లకు సెలవు.

Advertisement

Next Story

Most Viewed