- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nationwide: అన్ని నివేదికల్లోనూ జగన్‌దే టాప్ ప్లేస్!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)-ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారని తెలిపింది. అంటే 97 శాతం కోటీశ్వరులు ఉన్నారని...ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లు అని నివేదికలో తెలిపింది. వీరిలో రిచ్చెస్ట్ సీఎం వైఎస్ జగన్ అయితే అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిలిచారు. గతంలో ముఖ్యమంత్రుల వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులు, క్రిమినల్ కేసులు, విద్యార్హత, అత్యధిక వాహనాలు కలిగిన సీఎంలపై ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సైట్ ది ప్రింట్ నివేదికలోనూ సీఎం వైఎస్ జగన్ దేశంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. అలాగే పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిచ్చెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ నిలవడంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీలన్నీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఏడీఆర్ నివేదికలోనూ దేశంలోనే అత్యధిక ధనిక సీఎం జాబితాలో జగన్ ప్రథమస్థానంలో ఉండటంతో విమర్శలకు మరింత పదును పెట్టే అవకాశం లేకపోలేదు.
టాప్ ప్లేస్ జగన్‌దే
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)-ఎలక్షన్ వాచ్ ముఖ్యమంత్రుల ఆస్తులపై విశ్లేషణ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగా ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులపై అధ్యయనం చేసింది. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఆస్తులపై కూడా ఈ సంస్థలు అధ్యయనం చేశాయి. అయితే ఈ అధ్యయనంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు తేలింది. దీంతో సీఎం జగన్ దేశంలోనే అత్యధిక ధనిక సీఎంలలో టాప్‌స్థానంలో నిలిచారు. వైఎస్ జగన్ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ (రూ.163 కోట్లు), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లు)తో రెండు మూడు స్థానాల్లో నిలిచారు.
మమత దీ పూర్
ఇకపోతే అతితక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రులలో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మెుదలి స్థానంలో నిలిచారు. అతి తక్కువ ఆస్తి కలిగిన సీఎంగా నిలిచారు. మమతా బెనర్జీ ఆస్తులు కేవలం రూ.15 లక్షలుగానే చూపించారు. ఇకపోతే కేరళ సీఎం పినరయి విజయన్ ఆస్తులు కూడా కోటిపైనే ఉన్నాయి. అలాగే హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోటి రూపాయలు పైనే ఉన్నాయి. ఇకపోతే 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తి విలువ రూ.23.55కోట్లు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తి ఒక్కొక్కరిగా రూ.3 కోట్లకుపైగా ఉంది.
13 మందిపై క్రిమినల్ కేసులు
ఇదిలా ఉంటే ఏడీఆర్-ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 43శాతం మంది అంటే 13 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు తేలింది. హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులు వంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆయా ముఖ్యమంత్రులు వెల్లడించారని తెలిపింది. ఈ కేసులన్నీ పరిశీలిస్తే బెయిల్‌కు వీలు లేని దాదాపు ఐదేళ్లు కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులే కావడం గమనార్హం.
ది ప్రింట్ వెబ్‌సైట్‌లోనూ జగన్‌దే ఫస్ట్ ప్లేస్
ఇదిలా ఉంటే గతంలో ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సైట్ ది ప్రింట్ కూడా ముఖ్యమంత్రులకు సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రుల వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులు, క్రిమినల్ కేసులు, విద్యార్హత, గన్ లైసెన్సులు, అత్యధిక వాహనాలు ఇలా ఏడు అంశాలకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్‌సైట్ కేవలం 20 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరించి నివేదిక విడుదల చేసింది. ఇది కూడా ఆయా ముఖ్యమంత్రులు సమర్పించిన అఫిడవిట్స్‌ను ప్రాతిపదికగా తీసుకున్న సంగతి తెలిసిందే. ది ప్రింట్ అధ్యయనంలో కూడా దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచారు.ఆయన తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పేద ముఖ్యమంత్రుల జాబితాలో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ(రూ.15లక్షలు) ఆమె తరువాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(రూ.72 లక్షలు), బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(రూ.56 లక్షలు), కర్ణాటక, హర్యానా ముఖ్యమంత్రు బసవరాజ్ బొమ్మై, మనోహర్ లాల్ ఖట్టర్-రూ.1.37 కోట్లు, రూ.1.27 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే మనోహర్ లాల్ ఖట్టర్(హర్యానా), నవీన్ పట్నాయక్(ఒడిశా), యోగి ఆదిత్యనాథ్(ఉత్తర ప్రదేశ్), ఎన్ రంగస్వామి( పుదుచ్చేరి), మమత బెనర్జీ( పశ్చిమ బెంగాల్)లు అవివాహితులుగా ది ప్రింట్ పేర్కొంది. ఇకపోతే సిక్కిం ముఖ్యమంత్రి తమాంగ్ ఏకంగా ముగ్గురు భార్యలను కలిగి ఉన్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైనట్లు ది ప్రింట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read..
Cm Jagan: వాళ్లు చాలా గొప్పవాళ్లు.. అందుకే సెల్యూట్ చేస్తున్నా