AP Cm Jagan: ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్

by srinivas |   ( Updated:2023-06-14 14:01:26.0  )
AP Cm Jagan: ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆ సినిమా టికెట్‌ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు మంగళవారమే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ సినిమాకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో ఈ మూవీని 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ‘ఆదిపురుష్‌’ సినిమా టికెట్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది.

కాగా ‘ఆదిపురుష్’ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సీతగా కృతిసనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ ఆదిపురుష్ సినిమా విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Read more: ప్రభాస్ దెబ్బకు బుకింగ్ సైట్స్ క్రాష్.. మళ్లీ ఓపెన్ అయ్యేది ఎప్పుడో..?

Advertisement

Next Story