- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. అజెండా ఇదే..
దిశ డైనమిక్ బ్యూరో: జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. డీఎస్సీ నోటిఫికేషన్ పై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అలానే ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులకు సంబంధించి నాలుగో విడతకు ఆమోదం తెలపనుంది.
ఈ సమావేశంలో లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని సమాచారం. ఇక ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలపై మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచం స్థాయిలో పోటీ పడేలా విద్యావ్యవస్థలో కొత్త విధానాలను తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విద్యా బోర్డు IBతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ భాగస్వామ్యం కాబోతోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది. ఇక ఈ ఒప్పందం జరిగితే.. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యా బోధన ప్రారంభించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
కాగా 2025 లో ఒకటవ తరగతికి IB లో విద్యాబోధన చేపట్టనున్నారు. ఇలా ప్రతిసంవత్సరం ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతారు. దీన్నిబట్టి చూస్తే 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ సిలబస్ లో విద్యాబోధన జరిగేందుకు దాదాపు 10 సంవత్సరాలు పడుతోంది. 2025 లోమొదలైన ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ సిలబస్ లో విద్యాబోధన 2035 లో పూర్తి స్థాయిలో జరుగుతుంది.