Breaking: సీఎం జగన్‌‌కు రైతుల షాక్.. కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం..!

by srinivas |
Breaking: సీఎం జగన్‌‌కు రైతుల షాక్.. కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం..!
X

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లా సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కార్పలలో సభ ముగిసించుకుని సీఎం జగన్ పుట్టపర్తికి వెళ్లారు. అయితే అక్కడ సీఎం జగన్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కన్వాయ్‌ను తుంపర్తి, మోటుమర్రి రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగనన్న ఇళ్ల స్థలాల కోసం వారి నుంచి 210 ఎకరాలు తీసుకుని పరిహారం చెల్లించకపోవడంపై రైతులు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు రోడ్డుపై ఆదోళనకు దిగారు. వెంటనే తమకు పరిహారం చెల్లించాలని సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు.

రైతులను పక్కకు నెట్టేసిన సెక్యూరిటీ

దీంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రైతులను పక్కకు నెట్టేశారు. ఈ ఘటనతో రైతులు మరింత ఆగ్రహానికి గురైయ్యారు. తమ వద్ద స్థలాలు తీసుకుని ఇప్పటి వరకూ పరిహారం చెల్లించకుండా.. అడిగేందుకు వచ్చిన తమను దయాదాక్షణ్యాలు లేకుండా నెట్టివేస్తారా? అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed