Kalyanadurgam: మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త ఆత్మహత్యాయత్నం

by srinivas |
Kalyanadurgam: మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త ఆత్మహత్యాయత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహశీల్దారు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేత, మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కీ నాగలక్ష్మి భర్త బిక్కీ హరి ఆత్మహత్యాయత్నం ఒక్కసారిగా కలకలం రేపింది. సర్వే నంబర్ 409 భూమి వివాదం కారణంగా బిక్కీ హరి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూ వివాదంపై కళ్యాణదుర్గం తహశీల్దారును ఎన్నిసార్లు కలిసి విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో బిక్కీ హరి ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, సిబ్బంది అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Next Story