- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atrocious: ఫించన్ డబ్బులు కోసం తల్లిని చంపిన కుమారుడు
దిశ, అనంతపురం: వృద్ధాప్యంలో ఆలనా పాలన చూసుకోవాల్సిన కన్న కొడుకు కసాయిగా మారాడు. చెడు అలవాట్లకు బానిసై కన్నతల్లిని కడతేర్చాడు. ఈ విషాద సంఘటన శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం పందపర్తి గ్రామంలో నరసమ్మ (70) అనే వృద్ధ మహిళకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, చిన్న కుమారుడు శ్రీనివాసులు మద్యానికి బానిసై కన్నతల్లిని చూసుకోక పోవడంతో ఆమె ఒక చిన్న ఇంటిలో నివాసం ఏర్పరచుకొని ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తోంది. తల్లికి పింఛన్ డబ్బులు వచ్చాయన్న విషయం తెలుసుకుని మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని అడగాడు. వృద్ధురాలు నిరాకరించడంతో శ్రీనివాసులు విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన నరసమ్మ ఒకరోజు అంతా ఇంటిలోనే ఉండి ప్రాణాలను వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నరసమ్మ మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.