- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anantapur: వారితోనే మా పొత్తు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండకావాలే తప్ప ఇతర పార్టీల అండ అవసరం లేదని మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైసీపీ పొత్తు కేవలం ప్రజలతో మాత్రమేనని.. ఇతర పార్టీలతో కాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా శక్తిహీనుడు అయ్యాడని విమర్శించారు. అందుకే ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారని విమర్శించారు పొత్తుల కోసం అటు జనసేన ఇటు బీజేపీతో వెంపర్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని...తమకు పొత్తుల అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు.
అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పొత్తుల అవసరం విపక్ష నేతలకే ఉందని వైసీపీకి లేదన్నారు. 2019 ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అమలు చేశామని...జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు తాము అందిస్తున్న మంచిని గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతామన్నారు. రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.