ముందు వారి అకౌంట్లు సెటిల్ చేస్తా.. మాజీ ఎమ్మెల్యేస్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-03-10 16:02:32.0  )
ముందు వారి అకౌంట్లు సెటిల్ చేస్తా.. మాజీ ఎమ్మెల్యేస్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ప్రభాకర్ చౌదరికి టికెట్ రాదంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన స్పష్టం చేశారు. తనకు టికెట్ రాదన్న వారి అకౌంట్లు సెటిల్ చేస్తానని వ్యాఖ్యానించారు. అనంతపురం అర్బన్ టికెట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అనంతపురం అర్బన్‌లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే గెలుపు బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటానని ప్రభాకర్ చౌదరి చెప్పారు. త్వరలోనే చంద్రబాబును కలిసి నియోజకవర్గ పరిస్థితులను వివరిస్తానని తెలిపారు. కాగా అనంతపురం అర్బన్ స్థానం కోసం టీడీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజవకర్గంలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పోటీ చేసేందుకు స్థానిక జనసేన నేత ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం. ఇక ఇదే సీటుపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More..

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్..

Advertisement

Next Story