దిశ పేపర్ ఎఫెక్ట్: హుటాహుటిన కదిలిన అధికార యంత్రాంగం

by srinivas |   ( Updated:2023-04-06 14:12:36.0  )
దిశ పేపర్ ఎఫెక్ట్: హుటాహుటిన కదిలిన అధికార యంత్రాంగం
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మల్లయనూరులో పురాతన టెంపుల్‌పై ‘రోజమ్మ ఇటు రావమ్మ’ శిథిలమవుతున్న శిల్పకళ అనే కథనం దిశ పేపర్‌లో ఈ నెల 4న ప్రచురించడంతో జిల్లా పురావస్తు శాఖ అధికారులు పరుగులు తీశారు. దిశ పేపర్ ఎఫెక్ట్‌తో రెండు రోజుల వ్యవధిలోనే మాలయనూరు చారిత్రక కట్టడాలు అయిన జ్యోతిర్లింగ ఆలయాలను సందర్శించారు. ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భగా పురావస్తు శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ చాళుక్యులు, చోళులు , శ్రీ కృష్ణ దేవరాయ రాజులు కుందుర్పి ప్రాంతాన్ని పరిపాలించారని తెలిపారు. మలయనూరుఆలయాలను కల్యాణి చాళుక్యులు నిర్మించారని చెప్పారు. ఈ ఆలయాలకు రక్షణ కల్పించేందుకు ఏపీ పురావస్తు శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. ఆలయాన్ని శుభ్రం చేపిస్తామన్నారు. ప్రజల ఐక్యతతోనే ఆలయం అభివృద్ధి చెందాలన్నారు. చాలామందికి ఆలయాలపై అవగాహన లేక డబ్బు వ్యామోహంలో పడి నిధులు కోసం పెద్దలు నిర్మించిన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారన్నారన్నారు. జ్యోతిర్లింగాల ఆలయం చాలా బాగుందని, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి గవర్నమెంట్ పరిధిలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed