- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అద్దె ఇవ్వమంటే చంపేస్తామంటున్నారు.. Jc Prabhakar Reddyపై ఫిర్యాదు
- 12ఏళ్లుగా రూపాయి కూడా అద్దె ఇవ్వడం లేదు
- మా షాపును మాకు అప్పగించండి
- జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్పీకి దంపతుల ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను దంపతులు ఆశ్రయించారు. తమ షాపును గత పన్నెండేళ్లుగా జేసీ ట్రావెల్స్ కార్యకలాపాల కోసం వాడుకుంటూ అద్దె చెల్లించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జరిగిన 'స్పందన' కార్యక్రమంలో ఎస్పీ ఫకీరప్పకి యజమాని మల్లికార్జున ఆచారి తన భార్యతో కలిసి ఫిర్యాదు చేశారు. పన్నెండేళ్లుగా తమ షాపును వాడుకుంటూ అద్దె అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని..తన షాపును తనకు అప్పగించాలని ఫిర్యాదులో వేడుకున్నారు.
అనంతరం మీడియాతో దంపతులు మాట్లాడారు. సుభాష్ రోడ్డులోని నందిని హోటల్ ఎదురుగా తనకు ఒక షాపు ఉన్నట్లు మల్లికార్జున చారి వెల్లడించారు. అయితే 2000 సంవత్సరంలో బాబయ్య అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం 2010లో బాబయ్య ఆ షాపును జేసీ ట్రావెల్స్‌కు ఇచ్చారని అప్పటి నుంచి జేసీ ట్రావెల్స్ వాళ్లు తనకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని మల్లికార్జున వాపోయారు. అద్దె అడుగుతుంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని దీంతో తాము పాతూరులో నివసిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమ కుమారులిద్దరూ నిరుద్యోగులు కావడంతో వారితో ఏదైనా వ్యాపారం పెట్టించాలనే ప్రయత్నిస్తున్నామని అందులో భాగంగా షాపును ఖాళీ చేయమని అడుగుతుంటే దౌర్జన్యానికి దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షాపును ఖాళీ చేయించి తమకు అప్పగించాలని మల్లికార్జున దంపతులు వేడుకున్నారు. దుకాణంకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం ఎస్పీ ఫకీరప్పకు అందజేశారు.