- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే: ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి
దిశ ప్రతినిధి, అనంతపురం: అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా నన్నట్లు గా ఉంది చంద్రబాబు తీరు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడడం చంద్రబాబు నైజమని, ఆయన పచ్చి అవకాశవాది అని అనంత పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని 2వ డివిజన్‌లో మంగళవారం ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని గగ్గోలు పెట్టారు. ఈ రోజు మాకంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని మాయమాటలు చెబుతున్నారు అని ఆయన అన్నారు.
2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చి తీరా సీఎం కుర్చీలో కూర్చున్నక ఆ మేనిఫెస్టోను కూడా మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని చేయలేదు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి తీరా ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ తో సరిపెట్టారు. చంద్రబాబు మాటలు వినడం వల్లే మహిళా సంఘాలు డీఫాల్ట్ జాబితాలోకి వెళ్లాయి అన్నారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని, ఆ పాపంలో అప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన కూడా భాగస్వాములేనన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని, 40 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలేనని, ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజిత రాష్ట్రంలో గానీ పేదలకు మంచి చేయడం కోసం ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదన్నారు.చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా? అని ప్రశ్నించారు. పెనుకొండలో జరిగిన ‘రా కదలి రా’ సభలో రాయలసీమ గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పెనుకొండ ప్రాంతంలో రక్తం పారిన విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు.
హంద్రీనీవాకు రెండు సార్లు శంకుస్థాపనలకే పరిమితం చేసిన ఘనత చంద్రబాబుదని, 40 టీఎంసీల ప్రాజెక్ట్‌ను 5 టీఎంసీలకు కుదించింది కూడా చంద్రబాబేనన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే హంద్రీనీవా పనులు వేగవంతం చేశారన్నారు. 2012 నుంచి కృష్ణా జలాలు వస్తున్నాయంటే అది వైఎస్‌ఆర్ చలవేనన్నారు.టీడీపీకి, జనసేనకు ఇవే చివరి ఎన్నికలు. ప్రతిపక్షాలను కలుపుకుని వచ్చినా అధికారంలోకి వచ్చేది జగన్ నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని ఆయన అన్నారు.