- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు
X
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇకపోతే పెన్నానది తీరంలో అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ఆందోళనకు దిగారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి వందల లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అదే సందర్భంలో ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story