పవన్ కళ్యాణ్ చదువులపై వెలుగులోకి ఆసక్తికర విషయం!

by Disha Web Desk 18 |
పవన్ కళ్యాణ్ చదువులపై వెలుగులోకి ఆసక్తికర విషయం!
X

దిశ,వెబ్‌‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అఫిడవిట్‌లో ఆస్తుల వివారలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అఫిడవిట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏంటంటే..పవన్ కల్యాణ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్న విద్యాసంబంధ అంశాలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ చదువు 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారంట. ఆ స్కూల్లోనే టెన్త్ ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఇది చూసిన జనసేనాని అభిమానులు టాలెంట్‌కు చదువుతో పనిలేదని పవన్ నిరూపించారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట వైరల్‌గా మారింది.



Next Story