లోకేశ్‌ కోసం చంద్రబాబును భువనేశ్వరియే చంపొచ్చు: డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణలు

by Seetharam |   ( Updated:2023-10-16 07:07:42.0  )
లోకేశ్‌ కోసం చంద్రబాబును భువనేశ్వరియే చంపొచ్చు:    డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చంపితే నారా భువనేశ్వరే చంపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రాణానికి వైసీపీ వల్ల ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పుకొచ్చారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యానికి గానీ భద్రతకు గానీ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రాణానికి హాని ఉంటే అది నారా భువనేశ్వరి వల్ల లేదా కుటుంబ సభ్యులవల్లేనని ఆరోపించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న చరిత్ర నారా భువనేశ్వరిదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు పదవీకాంక్ష పట్టుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే భువనేశ్వరి కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం భర్తకు అన్నంలో ఏమైనా కలిపి చంపే ప్రయత్నం చేస్తుందనే అనుమానం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని చెప్పడానికి భువనేశ్వరి ఏమైనా డాక్టరా? అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed