కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆందోళనపై స్పందించిన కేటీఆర్

by Gantepaka Srikanth |
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆందోళనపై స్పందించిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆందోళనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతకొన్ని నెలలుగా తాము చెబుతున్నదే ఇవాళ జీవన్ రెడ్డి చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని తెలిపారు. పూర్తిస్థాయి హోంమంత్రి(Telangana Home Minister) లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయని చెప్పారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారు. ఇకనైనా పోలీసులు రాజకీయాలు మాని శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. పోలీసు అధికారులు ప్రభుత్వ పెద్దలు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని దారుణంగా హత్య చేశారు.

కారుతో వెనుక నుంచి ఢీ కొట్టి, సంతోష్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. రక్తం మడుగులో ఉన్న గంగారెడ్డి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. పాతకక్షలతోనే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలుమార్లు సంతోష్‌పై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసుల తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ రాజ్యంలో కాంగ్రెస్‌ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు.

Advertisement

Next Story