Rains: నగర ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు

by Mahesh |
Rains: నగర ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర వాసులతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ(Department of Meteorology) అలర్ట్ జారీ చేసింది. ఆకాశంలో ఏర్పాడుతున్న మార్పుల కారణంగా.. వచ్చే మూడు రోజు పాటు హైదరాబాద్(Hyderabad) నగరంలో పాటు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) అంచనా వేసింది. తాజా అలర్ట్ ప్రకారం. హైదరాబాద్‌, జగిత్యాల, మహబూబ్‌నగర్, కామారెడ్డి, ఖమ్మం, మల్కాజ్‌గిరి, మెదక్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌, నారాయణపేట, నిర్మల్‌, నల్గొండ,వనపర్తి సంగారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. అలాగే రంగారెడ్డి, వికారాబాద్‌, భువనగిరి జిల్లాల్లో.. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని అనంతపురం, రాయలసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పలు గ్రామాలను వరదలు పోటెత్తాయి.

Advertisement

Next Story

Most Viewed