Murmu: నీటి సంరక్షణ సమిష్టి బాధ్యత.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by vinod kumar |
Murmu: నీటి సంరక్షణ సమిష్టి బాధ్యత.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే సమాజం అభివృద్ధి చెందబోదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. జలవనరుల సంరక్షణ సమిష్టి బాధ్యత అని నొక్కి చెప్పారు. మంగళవారం ఆమె ఢిల్లీలో నేషనల్ వాటర్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రస్తుత కాలంలో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, రోజు రోజుకూ అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వనరులను సంరక్షించాలని సూచించారు. నీటి సంరక్షణను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ప్రధాన నాగరికతలు నీటి వనరుల చుట్టూ అభివృద్ధి చెందాయని అయినప్పటికీ, ఆధునిక కాలంలో నీటిని కాపాడటం తరచుగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు.

మానవ నిర్మిత కారణాల వల్లే నీటి వనరులు దెబ్బతింటున్నాయని స్పష్టం చేశారు. జనాభా పెరుగుదల కారణంగా దేశంలో నీటి లభ్యత తగ్గుదోందని తెలిపారు. కాగా, జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డులలో తొమ్మిది విభాగాల్లో కృషికి గుర్తింపు లభించింది. ఒడిశా ఉత్తమ రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో గుజరాత్, పుదుచ్చేరి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. జల్ సమృద్ధ్ భారత్ యొక్క ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి నేషనల్ వాటర్ అవార్డ్స్ ను 2018 నుంచి ప్రభుత్వం అందజేస్తోంది.

Advertisement

Next Story