గుంటూరులో దారుణం.. పోలీస్‌నంటూ యువ‌తిపై లైంగిక దాడి

by srinivas |   ( Updated:2024-10-06 12:52:08.0  )
గుంటూరులో దారుణం.. పోలీస్‌నంటూ యువ‌తిపై లైంగిక దాడి
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur) నడి బొడ్డున ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. పోలీస్‌నంటూ యువ‌తిపై ఓ వ్యక్తి లైంగిక దాడి((Sexual Assault)కి పాల్పడ్డారు. గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డులో ప్రియుడితో కలిసి యువతి బయటకొచ్చారు. అయితే వీరిని గమనించిన ఓ వ్యక్తి పోలీస్‌నంటూ వాళ్లను బెదిరించారు. ఈ సమయంలో బయట ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశించారు. దీంతో జంట బెదిరిపోయింది. పోలీస్ స్టేషన్‌(Police station)లో మాట్లాడదాం రండి అంటూ సదరు యువకుడిని అక్కడే వదిలేసి.. యువతిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం పరారయ్యాడు. దీంతో పోలీసులకు యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు పాత నేరస్తుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story