Capital of AP: అమరావతి Vs వైజాగ్.. రాజధానిగా ఇదే బెస్ట్.. ఎందుకంటే..?

by Indraja |
Capital of AP: అమరావతి Vs వైజాగ్.. రాజధానిగా ఇదే బెస్ట్.. ఎందుకంటే..?
X

దిశ వెబ్ డెస్క్: దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు గడుస్తున్నా రాజధాని నిర్మాణం జరగలేదు సరికదా, కనీసం రాజధాని ఏది అనే విషయంపై స్పష్టత కూడా లేదు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో రైతుల నుండి భూమిని సైతం ప్రభుత్వం సేకరించింది. అలానే రాజధాని నిర్మాణ పనులను సైతం ప్రారంభించింది. అయితే ఊహించని రీతిలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చారు.

రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు అని ప్రకటించారు. దీనితో ఏపీ రాజధాని విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశం సుప్రీకోర్టుకు చేరింది. అయితే ఏపీ రాజధానిగా అమరావతి, వైజాగ్ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వైజాగ్‌ రాజధాని అయితే కలిగే ప్రయోజనాలు ఏంటి..?

టైర్ 2 సిటీల్లో వైజాగ్‌ కూడా ఒకటి. అభివృద్ధి పరంగా ముందు వరసలో ఉంది. విస్తారమైన సముద్రతీరం ఉంది. దేశంలోనే పవిశాఖపట్నం నౌకాశ్రయం పెద్ద ఓడరేవు. ఇక్కడ సముద్రంలో నీరు తక్కువగా ఉండి లోతు ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మత్స్యపరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆంధ్రా విశ్వవిధ్యాలయంతోపాటుగా ఎన్నో విద్యాసంస్థలకు వైజాగ్‌ చిరునామాగా ఉంది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్లాంట్, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ISPRL), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇండియన్ నేవీ, హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి పలు ప్రముఖ సంస్థలు వైజాగ్‌‌లో ఉన్నాయి. ప్రకృతితో మమేకమై ఉన్న వైజాగ్‌ టూరిస్ట్ స్పాట్‌గా విరాజిల్లుతోంది.

అమరావతి రాజధాని అయితే కలిగే ప్రయోజనాలు ఏంటి..?

అమరావతి నదీ తీరాన ఉంది. నదీ తీరాన ఉన్న రాజధానులు త్వరగా అభివృద్ధి చెందుతాయి. అలానే అమరావతిలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు లేవు కనుక మనకి నచ్చినట్డు రాజధానిని నిర్మించుకునే అవకాశం ఉంది. అలానే ఇది టైర్ 2 సిటీలైన విజయవాడ, గుంటూరుకు మధ్యలో కేవలం 50 కి.మీ దూరంలో ఉంది. అలానే రాష్ట్రానికి మధ్యలో ఉంది.

కనుక అన్ని ప్రాంతాల నుండి ఉపాధి, ఉద్యోగాల కోసం ఇక్కడికి రావడం సులువుగా ఉంటుంది. ఇక పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు విద్యాసంస్థలకు పేరుగాంచాయి. అలానే ఇక్కడ పరిశ్రమలు కూడా ఉన్నాయి. సముద్రానికి అమరావతి 100 కి.మీ దూరంలో ఉంది. కనుక సునామీ వంటి విపత్తులు వచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లదు. అలానే వాడరేవు ఓడరేవు, నిజాంపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్టులు ఉన్నాయి, అలానే గన్నవరం విమానాశ్రయం, రైల్వే జంక్షన్ సైతం ఉంది కనుక రవాణాకు ఎలాంటి సమస్య ఉండదు. బీచ్‌లు, కనకధుర్గ ఆలయలయం వంటి ప్రదేశాలు టూరిస్ట్ స్పాట్‌గా ఉన్నాయి.

వైజాగ్‌ రాజధాని అయితే కలిగే నష్టాలు ఏంటి..?

అభివృద్ధి పరంగా ముందు వరసలో ఉన్నప్పటికీ మెట్రో సిటీలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబాయి వంటి సిటీలకు పోటీ ఇచ్చేటంత అభివృద్ధి మాత్రంలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సరిపడినంత తాగు నీరు లేదు. ఇప్పుడు ఉన్న ప్రజలకు నీరు సరిపోతుంది. కానీ వైజాగ్‌ రాజధాని అయితే అక్కడ జనాభా పెరుగుతుంది. అప్పుడు నీటి సమస్య ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైజాగ్‌ భౌగోళిక స్థితికూడా బాగాలేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైనంత స్థలం వైజాగ్‌‌లో లేదు. కొండల్ని తొలిగించి రాజధానిని విస్తరించాలి అని అనుకున్న నగరానికి రెండు వైపుల మాత్రమే విస్తరించే అవకాశం ఉంది. అలానే రాష్ట్రంలో భాగమైన రాయలసీమకు వైజాగ్‌‌ దూరంగా ఉంది. అలానే వైజాగ్‌‌‌లో ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇక్కడ నేవీ ఉన్న కారణంగా వైజాగ్‌ రాజధాని అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

అమరావతి రాజధాని అయితే కలిగే నష్టాలు ఏంటి..?

అమరావతిలో నదీతీరాన్ని ఆనుకుని సారవంతమైన సాగుభూమి ఉంది. అమరావతి రాజధాని అయితే ముఖ్యంగా సాగు భూమిలో పరిశ్రమలు వస్తాయి. పర్యావరణం కలుషితం అవుతుంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు.

మూడు రాజధానులు Vs అమరావతి..

మూడు రాజధానులు ఉంటే.. ప్రజలు ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కో చోటుకి వెళ్లాల్సి వస్తుంది. దీనితో అలసత్వం, అవినీతి కూడా పెరిగే అవకాశం ఉందని, అలానే చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి సైతం ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలానే పై కారణాల దృష్ట్యా వైజాగ్‌‌ను రాజధానిగా చేసేకంటే, ఒకేఒక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకోవడమే మంచదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed