AP High court:నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. విచారణ వాయిదా

by Jakkula Mamatha |   ( Updated:2024-10-24 08:34:38.0  )
AP High court:నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. విచారణ వాయిదా
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌(Nandigam Suresh)కు మరో భారీ షాక్ తగిలింది. మహిళ హత్య కేసులో నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జిల్లా(Guntur District) జైలులో(Guntur Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఆయనను రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. అయితే విచారణకు హాజరైన మాజీ ఎంపీ అడిగిన వాటికి సమాధానం చెప్పకపోవడం, విచారణకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో నందిగం సురేష్ (Bapatla Former MP Nandigam Suresh)బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో (AP High Court) నేడు(గురువారం) విచారణ జరిగింది. ఈ క్రమంలో నందిగం సురేష్ తరపున వాదనలు ముగిశాయి. వాదనలు వినిపించేందుకు పోలీసుల తరపున న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి (శుక్రవారం)కి వాయిదా వేసింది.

Advertisement

Next Story