ముమ్మాటికే అమరావతియే రాజధాని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

by Javid Pasha |   ( Updated:2023-02-11 14:13:24.0  )
ముమ్మాటికే అమరావతియే రాజధాని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతియే రాజధాని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే ఐదేళ్లలో అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో టీడీపీ ప్రభుత్వానికి రూ.9వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని అయితే ఆ డబ్బు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమరావతిలోనే రాజధాని కడతానన్న సీఎం వైఎస్ జగన్ మడమ తిప్పారని విమర్శించారు. విశాఖలో రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విశాఖను రెండు లక్షల కోట్ల రూపాయలతో కేంద్రం అభివృద్ధి చేస్తోంది అని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు రూ.300కోట్లు కూడా ఖర్చు చేయలేదు అని సోము వీర్రాజు మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రానికి కుటుంబ పార్టీలైన టీడీపీ, వైసీపీలు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఆ పార్టీలను బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

Also Read..

వివేకా హత్య కథ, స్రీన్ ప్లే, డైరెక్షన్ సీఎం దంపతులదే.. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప

Advertisement

Next Story

Most Viewed